డబుల్ బెడ్రూమ్ పథకం
డబుల్ బెడ్రూమ్ పథకం | |
---|---|
పథకం రకం | 5.72 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు |
ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
వ్యవస్థాపకులు | తెలంగాణ ప్రభుత్వం |
ముఖ్యమంత్రి | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
స్థాపన | 2016, మార్చి 5 |
బడ్జెట్ | ₹22,000 కోట్లు (2018 మార్చి నాటికి) |
వెబ్ సైటు | అధికారిక వెబ్సైటు |
డబుల్ బెడ్రూమ్ పథకం, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్ట్.[1] గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు ప్రభుత్వ నుండి నిధులు సమకూర్చి హైదరాబాదు నగరాన్ని మురికివాడలు లేని నగరంగా మార్చాలని ఈ పథక లక్ష్యం. ఈ పథకం ద్వారా 2019, మార్చి 2.72 లక్షల ఇళ్ళు, 2024 నాటికి అదనంగా మరో 3 లక్షల ఇళ్ళను నిర్మించబోతున్నారు.[2]
చరిత్ర
[మార్చు]2014, మే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మానిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకోసం 5.72 లక్షల ఇల్లు (హైదరాబాదులోని 2 లక్షల ఇళ్ళతో సహా) కేటాయించబడ్డాయి.[3] 2016, మార్చి 5న ఎర్రవల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామం సిద్ధిపేట జిల్లా లోని మర్కూక్ మండలంలో ఉంది.[4]
పథకం
[మార్చు]మీ సేవలో లేదా దాని కేంద్రాలలో ఆన్‌లైన్‌లో డబుల్ బెడ్రూమ్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాదు నగరంలో శుభ్రపరచాల్సిన మురికివాడలను గుర్తించి, నివాసానికి అనువుగా నిర్మాణం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో, ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని గుర్తించి, అక్కడ ఇల్లు నిర్మిస్తారు. ఇల్లు నిర్మాణం పూర్తయిన తరువాత, లబ్ధిదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు
[మార్చు]గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారు. 560 చదరపు అడుగులు నిర్మాణంలో రెండు బెడ్రూమ్ లు, ఒక కిచెన్, హాల్, రెండు బాత్రూమ్ లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో, ప్రాజెక్టులు గ్రౌండ్ +3 అంతస్తు అపార్టుమెంట్లుగా ఉన్నాయి. హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో గ్రౌండ్ +9 అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు.[5][6]
టన్నెల్ రూపం సాంకేతికత
[మార్చు]రాంపల్లి గ్రామంలోని 6,240 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, కొల్లూరు గ్రామంలోని 15,660 ఇళ్ళను తొందరగా నిర్మించడానికి, హైదరాబాదు మహానగరపాలక సంస్థ మొదటిసారిగా అధునాతన సొరంగం రూప సాంకేతికతను ఉపయోగించింది.
ఖర్చు పెరుగుదల
[మార్చు]2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒక్కో ఇంటికి ₹ 3.5 లక్షలు ఖర్చుగా అంచనా వేయబడింది. అయితే, ఇళ్ళ డిజైన్ లో మార్పు, ముడి వస్తువుల ధరలు పెరగడం వల్ల 2017 నాటికి ఒక్కో ఇంటికి ₹ 7.5 లక్షలకు పెరిగింది. ఇతర సౌకర్యాలు, రోడ్లు మొదలైన వాటి కోసం ఒక్కో ఇంటికి అదనంగా ₹1.25 లక్షలు అవుతున్నాయి. మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకు ఇచ్చేలా సిమెంట్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని, ఆన్‌లైన్‌లో బిల్లులను చెల్లించింది. గత రెండేళ్ళలో ఉక్కు ధరలు మూడు రెట్లు పెరిగాయి. ప్రభుత్వం కాంక్రీటుకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తుంది.
ఇతర వివరాలు
[మార్చు]డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పథకంలో భాగంగా 9,328.32 కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 2,91,057 ఇళ్ళు మంజూరు చేయబడ్డాయి. ఇందులో 2,28,529 ఇళ్ళ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిం, 2018 మార్చి నాటికి, 2.72 లక్షల టార్గెట్ చేసిన ఇళ్ళలో, 9500 ఇళ్ళు పూర్తయ్యాయి. 18,000 కోట్లకు పైగా బడ్జెట్ వ్యయంతో 1,69,000 ఇళ్ళు పూర్తి దశలో ఉన్నాయి.[7] 2022 నవంబరు నాటికి 11,614.95 కోట్లు రూపాయలు ఖర్చుచేసింది. ఇందులో 1,29,528 ఇళ్ళుపూర్తికాగా... 58,350 ఇళ్ళు నిర్మాణం తుదిదశలోనూ 40,651 ఇళ్ళు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి.[8]
జీహెచ్‌ఎంసీ
[మార్చు]జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ళకు ప్రణాళికలు చేయబడింది.
మొదటి విడత
[మార్చు]2023 సెప్టెంబరు 2న మొదటి దశలో భాగంగా 9 ప్రాంతాల్లో లాటరీ పద్ధతిలో 11,700 మంది లబ్ధిదారులకు ఇళ్ళను కేటాయించి పట్టాలు అందజేయబడ్డాయి.[9]
కొల్లూరులో మంత్రి టి. హరీశ్‌రావు, కుత్బుల్లాపూర్‌లోని బహదూర్‌పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పటాన్‌చెరు సమీపంలోని కర్ధనూర్‌లో మంత్రి పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అహ్మద్‌నగర్‌లో మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ, మేడ్చల్‌లోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్, కాప్రా డివిజన్‌లోని శ్రీరాంనగర్‌లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు.[10]
రెండవ విడత
[మార్చు]2023 సెప్టెంబరు 21న రెండో విడతతో భాగంగా 9 ప్రాంతాల్లో లాటరీ పద్ధతిలో 13,300 మంది లబ్ధిదారులకు ఇళ్ళను కేటాయించి పట్టాలు అందజేయబడ్డాయి.[11] కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో మంత్రి కేటీఆర్, పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్‌రావు, చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ హట్టిగూడలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, తట్టి అన్నారంలో మంత్రి మహమూద్ అలీ, మహేశ్వరం నియోజకవర్గంలోని మన్‌సాన్‌పల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జవహర్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, తిమ్మాయిగూడెంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు.[12]
మూడో విడత
[మార్చు]2023 అక్టోబరు 2న రెండో విడతతో భాగంగా 19,020 మంది లబ్ధిదారులకు ఇళ్ళను కేటాయించి పట్టాలు అందజేయబడ్డాయి.[13] నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని 19,020 మంది లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు.[14]
బడ్జెట్ వివరాలు
[మార్చు]ఈ పథకం అమలుకు 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 2,643 కోట్ల రూపాయలు కేటాయించారు.[15][16]
అవార్డు
[మార్చు]- హడ్కో డిజైన్ అవార్డు - 2017
మూలాలు
[మార్చు]- ↑ Double bedroom Housing scheme facing hurdles in Hyderabad
- ↑ "Puri says Telangana's double bedroom housing scheme for poor". www.outlookindia.com. Retrieved 2020-03-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ AuthorTelanganaToday. "Telangana Govt to construct 3 lakh 2BHKs in next five years". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-03-02.
- ↑ "GHMC's Rs. 13.15 crore budget 'divided'". The Hindu. 27 February 2018. Retrieved 20 February 2020.
- ↑ Telangana proposes Rs 5 L insurance cover, Rs 12K cr support scheme for farmers - Moneycontrol.com
- ↑ KCR dares opposition to prove graft charges
- ↑ "Hadko award to double bedrrom scheme". Archived from the original on 30 ఏప్రిల్ 2018. Retrieved 30 April 2018.
- ↑ telugu, NT News (2022-11-23). "1,29,528 డబుల్ బెడ్రూం ఇండ్లు సిద్ధం.. త్వరలోనే పంపిణీ". www.ntnews.com. Archived from the original on 2022-11-23. Retrieved 2022-11-23.
- ↑ telugu, NT News (2023-09-01). "రేపే ఇంటి పండుగ". www.ntnews.com. Archived from the original on 2023-09-01. Retrieved 2023-09-06.
- ↑ "కల సాకారమయ్యే వేళ". EENADU. 2023-09-01. Archived from the original on 2023-09-02. Retrieved 2023-09-06.
- ↑ "2 BHK Housing Scheme : హైదరాబాద్లో 13,300 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు.. త్వరలో మరో 70,000 మందికి." The Economic Times Telugu. Archived from the original on 2023-09-28. Retrieved 2023-09-28.
- ↑ telugu, NT News (2023-09-22). "మరో 13,300 మందికి." www.ntnews.com. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-28.
- ↑ "Double bedroom Scheme : హైదరాబాద్ పరిధిలో 19,020 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేత.. అక్టోబర్ 5న నాలుగో విడత." The Economic Times Telugu. 2023-10-03. Archived from the original on 2023-10-03. Retrieved 2023-10-03.
- ↑ telugu, NT News (2023-10-03). "2BHK houses | కేసీఆర్ కలల సౌధాలు నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకలు.. గ్రేటర్‌లో 19,020 డబుల్ ఇండ్ల పంపిణీ". www.ntnews.com. Archived from the original on 2023-10-03. Retrieved 2023-10-03.
- ↑ "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
- ↑ Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
బయటి లింకులు
[మార్చు]- డబుల్ బెడ్రూమ్ పథకం అధికారిక సైట్ Archived 2021-06-09 at the Wayback Machine